దీనబంధు కాలనీ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహేందర్ ప్యానల్ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మొదట అధ్యక్షుడు మహేందర్ ప్రమాణస్వీకారం చేస్తూ ఆత్మ సాక్షిగా భగవంతునిపై ప్రమాణం చేసి స్థానిక ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని అన్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి గడ్డం కృష్ణ కోశాధికారి ఆవుల రాజు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారుఈ సందర్భంగా కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వాళ్లే నాయకులు అవుతారని స్థానిక ప్రజలు అభిమానంతో నాయకుడైన మహేందర్, వారి నమ్మకం నిలబెట్టాలని అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు మహేందర్ తో తనకు గత కొన్ని సంవత్సరాలుగా స్నేహ బంధం ఉందని మంచి వ్యక్తిని ప్రజాసేవ చేయగల సత్తా ఉన్న మనిషి అని అన్నారు.దీనబంధు కాలనీ సొసైటీ నూతన అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఆధ్వర్యంలో తనకు ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు సొసైటీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అసౌకర్యాలు ఏర్పడిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తక్షణ పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తానని ప్రభుత్వ ఫలాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని అన్నారు .ప్రమాణ స్వీకార మహోత్సవానికి అశేష జనవాహిని తరలిరావడం నూతన అధ్యక్షుడికి ప్యానల్ మెంబర్స్ కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ వార్డు సభ్యులు ఎల్లం నాయుడు వెంకటయ్య మరియు నాయకులు కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
దీనబంధు కాలనీ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహేందర్ ప్యానల్ ప్రమాణ స్వీకారం